ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది

ABN, First Publish Date - 2021-02-27T05:30:00+05:30

సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే భయం పట్టుకుందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు విజయరామారావు ఎద్దేవా చేశారు.

జిల్లా పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న విజయరామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి విజయరామారావు


సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 27: సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే భయం పట్టుకుందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు విజయరామారావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ తన కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉద్యోగాలిచ్చాడని విమర్శించారు. గోదావరి నీటిని తెలంగాణ ప్రజలందరికీ చేరవేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రానికి మాత్రం పుష్కలంగా నీటిని మళ్లించుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి బూత్‌ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి శ్రీవర్ధన్‌రెడ్డి, ఏబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌గౌడ్‌, నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్‌, మురళీధర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపి, తోట చంద్రశేఖర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising