ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో బెల్టుషాపుల జోరు!

ABN, First Publish Date - 2021-06-21T05:09:28+05:30

గ్రామాల్లో మంచి నీళ్లు దొరకకపోవచ్చుగాని మద్యం మాత్రం పక్కాగా దొరుకుతోంది. ఏ చిన్న పిల్లవాడిని మందు ఎక్కడ దొరుకుతుందని అడిగినా చెబుతాడు. మద్యం దుకాణాలు ఇప్పుడు గ్రామాల్లో గల్లీకొకటి వెలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనీ టైమ్‌ మద్యం లభ్యం

 పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు


సిద్దిపేట క్రైం, జూన్‌ 20: గ్రామాల్లో మంచి నీళ్లు దొరకకపోవచ్చుగాని మద్యం మాత్రం పక్కాగా దొరుకుతోంది. ఏ చిన్న పిల్లవాడిని మందు ఎక్కడ దొరుకుతుందని అడిగినా చెబుతాడు. మద్యం దుకాణాలు ఇప్పుడు గ్రామాల్లో గల్లీకొకటి వెలిశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైన్‌ షాపులు సాయంత్రం మూతపడగా బెల్టుషాపులకు గిరాకీ పెరగడంతో గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. నిర్వాహకులు వైన్‌ షాప్‌లో కొనుగోలు చేసి గ్రామాల్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. మద్యంప్రియులు కూడా ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులను నిర్వహిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.


చర్యలు తీసుకోని అధికారులు


గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు వెలుస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులకు మామూళ్లు ఇస్తూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నూతన ఎక్సైజ్‌ మద్యం పాలసీ ప్రకారం ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్ట్‌షాప్‌ నిర్వాహకులకు హద్దు లేకుండా పోతోంది. అంతేకాకుండా మద్యం షాపులు రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెల్లడించినప్పటికీ గ్రామాల్లో రోడ్ల పక్కన దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు.


బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం


గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపినట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తే సమాచారమివ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.


 


Updated Date - 2021-06-21T05:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising