భక్తజన సందోహంగా బీరంగూడ గుట్ట
ABN, First Publish Date - 2021-03-12T05:38:24+05:30
శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైౖవక్షేత్రం అమీన్‌పూర్ బీరంగూడ గుట్టపై వెలసిన స్వయంభు మల్లికార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు, మార్చి 11: శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైౖవక్షేత్రం అమీన్‌పూర్ బీరంగూడ గుట్టపై వెలసిన స్వయంభు మల్లికార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, పూజలు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వామివారిని దర్శించకుని ప్రత్యే పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైద్య బృందాలు, పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు గుట్టపై విధులు నిర్వహించారు. శుక్రవారం మల్లన్న కల్యాణోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఆయల చైర్మన్ తెలిపారు.
Updated Date - 2021-03-12T05:38:24+05:30 IST