ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగకు ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

ABN, First Publish Date - 2021-10-09T05:03:50+05:30

తెలంగాణాలో బతుకమ్మ, దసరా పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వృత్తి, ఉద్యోగరీత్యా ఏ ప్రాంతాల్లో స్థిరపడినవారైనా ఈ పండగలకు మాత్రం స్వగ్రామాలకు వెళ్తారు. మరోవైపు ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఇంటికి తాళంవేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ సూచించారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు తోడు, ప్రజలు సహకరిస్తేనే చోరీల నివారణ సాధ్యమవుతుందన్నారు. పండుగకు ఊరెళ్లే వారికి ఆయన పలు సూచనలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకండి

ఇరుగు, పొరుగుకు చెప్పి వెళ్లండి : ఎస్పీ


సంగారెడ్డి క్రైం, అక్టోబరు 8 : తెలంగాణాలో బతుకమ్మ, దసరా పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వృత్తి, ఉద్యోగరీత్యా ఏ ప్రాంతాల్లో స్థిరపడినవారైనా ఈ పండగలకు మాత్రం స్వగ్రామాలకు వెళ్తారు. మరోవైపు ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఇంటికి తాళంవేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ సూచించారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు తోడు, ప్రజలు సహకరిస్తేనే చోరీల నివారణ సాధ్యమవుతుందన్నారు. పండుగకు ఊరెళ్లే వారికి ఆయన పలు సూచనలు చేశారు. 

‘ఊరెళ్లేవారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచొద్దు. ఆభరణాలు, నగదు తదితరాలను వెంట తీసుకువెళ్లడమో.. బ్యాంకు లాకర్లలో దాచడమో చేయాలి. పొరుగువారికి తమ ఇంటివైపు గమనించాలని కోరాలి. అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి చుట్టుపక్కలవారికి ఫోన్‌ నంబర్‌ ఇచ్చి, వారి నంబర్‌ తీసుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేయాలి. బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలోనూ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మహిళలు బతుకమ్మ ఆడటానికి బంగారు ఆభరణాలు ధరించి వెళ్తుంటారు. ఆ సమయంలో చైన్‌స్నాచింగ్‌లు జరగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకు బంగారు ఆభరణాలు వేసి బయటకు పంపకూడదన్నారు. వీధి వ్యాపారాల పేరుతో గ్రామంలో తిరిగే కొత్తవారిపై నిఘా ఉంచాలి. రాత్రి వేళల్లో కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీ్‌సస్టేషన్‌కు లేదా 100 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి. 

Updated Date - 2021-10-09T05:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising