ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులంపేరుతో దూషించిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు

ABN, First Publish Date - 2021-10-20T05:07:05+05:30

ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళీఘణపూర్‌, అక్టోబరు 19: ఓ వ్యక్తిని కులంపేరుతో దూషించి, దాడి చేసిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బ్యాతోల్‌లో గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపులో యువతికి సంబంధించిన వీడియోను ఓ యువకుడు పోస్టు చేశాడు. దానిని డిలీట్‌ చేయాలని అదే గ్రామానికి చెందిన ఆశ రాజు(ఎల్లయ్య)  ఆ యువకుడికి సూచించాడు. ఈ మేరకు వీడియోను ఆ యువకుడు డిలీట్‌ చేశాడు. అనంతరం ఆశ రాజు ఆ వీడియోను తీసివేయించాడని ఆ యువకుడు పరశురాంగౌడ్‌ అనే వ్యక్తికి చెప్పాడు. ఈ విషయమై  కక్షగట్టిన పరశురాంగౌడ్‌ ఆశరాజును మండలపరిధిలోని తీన్‌ నంబర్‌ గేటు వద్దకు తీసుకెళ్లి కులం పేరుతో దూషించాడు. ఆపై దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితుడు సోమవారం రాత్రి హవేళీఘణపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మెదక్‌ డీఎస్పీ సైదులు, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి బ్యాతోల్‌ గ్రామంలో విచారణ జరిపి పరశురామ్‌గౌడ్‌తో పాటు మరో ఆరుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నట్టు వారు తెలిపారు.  

Updated Date - 2021-10-20T05:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising