ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సఖి కేంద్రంతో బాధిత మహిళలకు భరోసా

ABN, First Publish Date - 2021-02-28T05:34:18+05:30

భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, ప్రేమ ఉన్నచోట తగవులు ఉండవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు.

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి


సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 27: భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని, ప్రేమ ఉన్నచోట తగవులు ఉండవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని సఖి కేంద్రంలో మహిళలకు గృహహింస చట్టంపై న్యాయ అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు సఖీ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సఖీ సెంటర్‌ నిర్వాహకురాలు సుజాతరాజ్‌ మాట్లాడుతూ సఖి కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి 963 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. బాధిత మహిళలకు కౌన్సిలింగ్‌ ద్వారా విశ్వాసం కలిగిస్తున్నామని, ఆర్థిక సాధికారత సాధించేలా సహాయం చేస్తున్నామని వివరించారు. అనంతరం గృహహింస బాధిత మహిళలకు అందించే సేవలపై వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సీనియర్‌ న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశలత, అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కల్పన, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎండీ అబ్దుల్‌జలీల్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పద్మావతి, సీడబ్య్లూసీ చైర్‌పర్సన్‌ శివకుమారి, సఖీ కేంద్రం పర్యవేక్షకురాలు సుజాతరాజ్‌, కౌన్సిలర్లు వసంత, కల్పన పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising