30 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకం
ABN, First Publish Date - 2021-10-30T04:19:54+05:30
సంగారెడ్డిలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 30 మంది సీనియర్ రెసిడెంట్లు నియామకం అయ్యారు.
సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 29 : సంగారెడ్డిలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 30 మంది సీనియర్ రెసిడెంట్లు నియామకం అయ్యారు. వారిలో అనస్థేషియా-3, అనాటమీ-1, బయోకెమిస్త్రీ-2, సైక్యాట్రిక్-1, పల్మనాలజీ-2, రేడియాలజీ-2, ఈఎన్‌టీ-1, జనరల్ సర్జరీ-3, ఆప్తమాలజీ-2, డెర్మటాలజీ-1, జనరల్ మెడిసిన్-3, పాతాలజీ-2, మైక్రోబయోలజీ-1, పిడియాట్రిక్స్-1, ఫిజియోలజీ-1, ఓబీజీ-2, ఆర్థోపెడిక్ ఇద్దరు ఉన్నారు. పీజీ వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు ఏడాది పాటు ఎంపిక చేసిన మెడికల్ కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు రోజులుగా హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించగా, సంగారెడ్డి జీఎంసీకి 30 మంది సీనియర్ రెసిడెంట్లను నియమిస్తూ డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2021-10-30T04:19:54+05:30 IST