ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-03-01T05:22:50+05:30

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌ గ్రామం నుంచి వేములవాడకు పాదయాత్రగా వెళ్తున్న నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్‌

 ఎల్లాపూర్‌ నుంచి వేములవాడకు పాదయాత్ర


పాపన్నపేట, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎల్లాపూర్‌ గ్రామం నుంచి సుమారు 60మందితో కలిసి వేములవాడకు (120 కిలోమీటర్లు) పాదయాత్రగా బయలు దేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సద్బుద్ధి కల్గించి రైతులకు మేలు జరిగేలా రాజరాజేశ్వరుడిని కోరడానికి వేములవాడకు పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల్లో వేములవాడకు చేరుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పోచయ్య, రామకిష్టయ్య, విఠల్‌ రైతులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-01T05:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising