అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
ABN, First Publish Date - 2021-07-13T05:42:04+05:30
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయనున్న డంప్‌యార్డుకు సంబంధించిన పనులను వెంటనే చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.
నర్సాపూర్, జూలై 12: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయనున్న డంప్‌యార్డుకు సంబంధించిన పనులను వెంటనే చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నర్సాపూర్ పట్టణంలో పలు ప్రాంతాలను ఆమె కమిషనర్ అశ్రిత్‌కుమార్, ఏఈ స్వామిదా్‌సతో కలిసి సందర్శించారు. మొదటగా నర్సాపూర్ చెరువు కట్ట వద్దకు వెళ్లి కట్టకు ఇరువైపులా పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా చెరువు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి కట్ట వరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అక్కడి నుంచి సమీకృత మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి బస్టాండు సమీపంలో కుంట వద్ద పార్కు కోసం చదును చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ పరిధిలో ఉన్న ఈ స్థలం మున్సిపాలిటీకి పార్కు కోసం కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా డంప్‌యార్డు స్థలం పరిశీలించిన ఆమె యార్డుకు వెళ్లేందుకు రోడ్డును వెంటనే వేయాలని సూచించారు. పట్టణంలో ఎక్కడ అవకాశముంటే అక్కడ గ్రీనరీ పెంచేలా చొరవ తీసుకోవాలని కమిషనర్‌కు తెలిపారు.
Updated Date - 2021-07-13T05:42:04+05:30 IST