ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-25T04:14:58+05:30

రోడ్డు పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ఏఎ్‌సఆర్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు కాంట్రాక్టర్‌ లైసెన్సును రద్దుచేయాలని మిరుదొడ్డి మండల పరిరక్షణ సమితి నాయకులు ఐలయ్య, కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మిరుదొడ్డిలో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డిలో గంటపాటు వ్యాపారులతో కలిసి గ్రామస్థుల ఆందోళన

సీసీరోడ్డు టెండర్‌ను రద్దుచేసి తారురోడ్డు వేయాలని డిమాండ్‌

పోలీసులతో వాగ్వాదం

మిరుదొడ్డి, అక్టోబరు 24 : రోడ్డు పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ఏఎ్‌సఆర్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు కాంట్రాక్టర్‌ లైసెన్సును రద్దుచేయాలని మిరుదొడ్డి మండల పరిరక్షణ సమితి నాయకులు ఐలయ్య, కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మిరుదొడ్డిలో ప్రధాన రహదారిపై వ్యాపారస్తులు గ్రామస్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తారురోడ్డును తవ్వేసి సీసీరోడ్డును వేస్తామని చెప్పి ఇప్పటివరకూ వేయడం లేదన్నారు. దీనివల్ల రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. దీంతో ప్రమాదాలు జరగడంతో పాటు చిరువ్యాపారులు, ఇండ్లలో నివాసముంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. దుమ్ము, ధూళి వల్ల అనారోగ్య సమస్యలకు గురై ఆస్పత్రిలో చేరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీరోడ్డు పనులు చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు మరమ్మతు పనులు నిర్వహించకపోవడం దారుణమన్నారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రోడ్డును తవ్వి కంకర పోయడం ద్వారా దుమ్ము, ధూళితో ప్రజలు ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్టర్‌ తూతూమంత్రంగా నీళ్లను పట్టించారని పేర్కొన్నారు. ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, గ్రామస్థులకు వాగ్వాదం చోటు చేసుకున్నది. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ వచ్చేవరకు ధర్నాను విరమించబోమని తేల్చిచెప్పారు. వెంటనే సంబంధిత ఆర్‌అండ్‌బీ డీఈ ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. సీసీరోడ్డు టెండర్‌ను రద్దుచేసి, యధావిధిగా తారురోడ్డును వేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీఇవ్వడంతో ధర్నా విరమించారు. సుమారు గంటపాటు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బాబు, విజయ్‌, రవి, సురేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-10-25T04:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising