ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమానికి ఏటా రూ. 35వేల కోట్లు

ABN, First Publish Date - 2021-01-24T06:28:12+05:30

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు.

నందిగామలో రైతు వేదికను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


పటాన్‌చెరు రూరల్‌, జనవరి 23: రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏటా రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామలో నిర్మించిన రైతు వేదికను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదకల నిర్మాణానికి పూనుకున్నారని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, ఉద్యోగులకు సంఘాలున్నాయని, వ్యవసాయదారులకే ఎలాంటి సంఘాలు లేవన్నారు. అందుకే రైతులను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి రైతువేదకలు ఉపకరిస్తాయని వివరించారు. లాభదాయక పంటలు, వ్యవసాయంపై చర్యకు ఇవి వేదికలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన, చిత్తశుద్ధితోనే తెలంగాణ నేడు కోటి ఎకరాల మాగాణిగా మారిందని కొనియాడారు. వర్షంతో, కరెంటుతో సంబంధం లేకుండా రెండు పంటలు పండిస్తున్నారని గుర్తిచేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ, కార్పొరేటర్లు కుమార్‌యాదవ్‌, సింఽధు, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, నందిగామ సర్పంచ్‌ ఉమావతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాండు, కలెక్టర్‌ హన్మంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T06:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising