ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 ఏళ్ల జ్ఞాపకం

ABN, First Publish Date - 2021-10-24T05:01:11+05:30

హుస్నాబాద్‌ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో నిర్మించిన 88 అడుగుల ఎత్తయిన స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి సోమవారం నాటికి సరిగ్గా 31 ఏళ్లు.

హుస్నాబాద్‌లోని అతిపెద్ద అమరవీరుల స్తూపం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌, అక్టోబరు 23 : బిడ్డలారా మీరొడ్డిన నెత్తురింకా/ నేలలోన పడనివ్వం/ పరిచినది పంచే కాదు../ కడుపుకోత పేగులురా... అంటూ పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో అమరులైన బిడ్డలను స్మరిస్తూ, హుస్నాబాద్‌ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో నిర్మించిన 88 అడుగుల ఎత్తయిన స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి సోమవారం నాటికి సరిగ్గా 31 ఏళ్లు. గ్రానైట్‌ రాయితో నిర్మించిన ఈ స్తూపం ఆసియాలో రెండో అతిపెద్దది. 1972 నుంచి 1989 మధ్య కాలంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన నక్సలైట్ల పేర్లను ఈ నిర్మాణంపై చెక్కించారు. 25 అక్టోబర్‌ 1990న వేలాది మంది సమక్షంలో ఆవిష్కృతమైన ఈ స్తూపం అనంతరం పదేళ్లలోనే నేలమట్టమయింది. దీని ఆవిష్కరణ సమయంలో ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో నక్సలైట్లు ముగ్గురు అధికారులను కిడ్నాప్‌ చేసి మరీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత పోలీసు చర్యలతో స్తూపం ధ్వంసమవుతూ వచ్చింది. 2000లో హుస్నాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇంటిని నక్సలైట్లు పేల్చివేయడంతో ప్రతిగా గ్రీన్‌టైగర్స్‌ పేరుతో ఈ స్తూపాన్ని డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు తుమ్మలు పెరిగి అమరుల త్యాగాలను వెక్కిరిస్తున్నది. 

Updated Date - 2021-10-24T05:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising