ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపాలిటీల్లో వందశాతం వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-10-29T05:01:00+05:30

సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో వందశాతం వ్యాక్సిన్‌ చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నామని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి, మున్సిపల్‌, ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

అమీన్‌పూర్‌లో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న రాజర్షిషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవంబర్‌ 3 లోపు మొదటి డోసు పూర్తి

సంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా


పటాన్‌చెరు, అక్టోబరు 28: సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో వందశాతం వ్యాక్సిన్‌ చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నామని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి, మున్సిపల్‌, ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్య సిబ్బందికి ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవడంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి విద్యావంతులు, యువత, మహిళాసంఘాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కృషిచేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్‌ 3వ తేదీ లోపు మొదటి డోసు వేసుకోని వారిని గుర్తించి, వ్యాక్సిన్‌ వేయాలని నిర్ధేశించామన్నారు. గడువు దాటినా రెండో డోసు వేసుకోని గుర్తించి ఈ నెల 30లోపు వేస్తామన్నారు. ఇంటింటి సర్వే ద్వారా వ్యాక్సిన్‌ వేసుకోనివారిని గుర్తించి, ఇంటి వద్దనే వ్యాక్సిన్‌ వేస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల్లో పోషకాహర లోపంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, డాక్టర్‌ స్వప్న పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising