ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చే వరకు పోరాటం

ABN, First Publish Date - 2021-07-27T04:33:45+05:30

డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చే వరకు పోరాటం

ర్యాలీగా వస్తున్న ఎంసీపీఐ(యూ) కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవో నంబర్‌ 13ను రద్దు చేయాలి

ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద నిరసన

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, జూలై 26: పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఇళ్ల నివాస స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని, అనర్హుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని జీవో నంబరు 13ను రద్దు చేయాలని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండ ఏకశి లా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను, కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కుంటి సాకులతో స్థలాలను కట్టబెట్టడానికి జీవోలను, చట్టాలను రూపొందిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు చెందాల్సిన భూములను రక్షించుకొని అనుభవించాల్సిన బాధ్యత పేదలపై ఉందన్నా రు. ఇందుకు ఉద్యమాలే ఏకైక మార్గమన్నారు. పేదలకు ఎర్ర జెండా ఎల్లప్పుడు అండ ఉంటుం దన్నారు. ఎన్నికల్లో మోదీ, కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ ఎం. హరితను పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్ర మంలో జిల్లా సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదెగోని రవి, జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, వంగల రాగసుధ, ఎంరెడ్డి హంసారెడ్డి, మంద రవి, కుసుంబ బాబురావు, కొమురయ్య, నాగార్జున, మహ్మద్‌ రాజాసాహేబ్‌, కొత్తకొండ రాజమౌళి, యాదగిరి, మల్లికార్జున్‌, కుమారస్వామి, రాజు, ఫాతిమా పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T04:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising