ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజంతా ముసురే...

ABN, First Publish Date - 2021-07-22T06:00:43+05:30

రోజంతా ముసురే...

బయ్యారంలో పరవళ్లు తొక్కుతూ మత్తడి పోస్తున్న పెద్ద చెరువు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరికొన్ని చోట్ల భారీ వర్షం

మత్తడి పోస్తున్న చెరువులు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జూలై 21 : జిల్లాలో మ రోమారు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వారంలో కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసినప్పటికి ఐదు రోజు లుగా అక్కడక్కడ మాత్రమే చినుకులు పడ్డాయి. కొన్ని మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు కొంతమేరకు పెరిగిపోవడంతో బావులు లేని రైతులు మొక్కలకు బిందెలతో నీళ్లు పోసుకుంటూ మొక్కలను కాపాడుతున్నారు. కొత్తగూడ, గంగారం, కేసముద్రం, డోర్నకల్‌, గార్ల, కురవి, బయ్యారం, మహబూబాబాద్‌ , నెల్లికుదురులో మంగళ వారం ఒక మొస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ మండలాలతో పాటు మరిపెడ, చిన్నగూడూరు, గూడూరు, నర్సింహులపేట, తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లిలో రాత్రి నుంచి ఏకదాటిగా ముసురు కురుస్తోంది. అప్పుడప్పుడు వర్షం చినుకులు పెద్దగా వస్తూ పోతూ ఉంది. దీంతో వర్షంపు నీరు చెరువుల్లోకి భారీ చేరుకుంటున్నాయి. తొర్రూరులో కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరి అలుగులు పోస్తుండగా మరికొన్ని చెరువులు నిండు కుంటున్నాయి. చెరువులు అలుగులు పోస్తుండగా చేపలు బయటకు పోకుండ వాటిని కాపాడుకోవడానికి మత్స్యకారులు వలలు ఏర్పాటు చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. 


జిల్లాలో 248.2 మిల్లిమీటర్ల వర్షపాతం

జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం 8.30 వరకు వర్షపాతం 248.2 మిల్లిమీటర్ల వర్షపా తం నమోదైంది. సగటున 20.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడ లో 38.2 మిల్లిమీటర్ల వర్షపాతంతో భారీగా వర్షం కురిసింది. బయ్యారంలో 17.4, గార్లలో 19.0, డోర్నకల్‌లో 23.4, కురవిలో 32.2, మహబూబాబా ద్‌లో 18.8, గూడూరులో 8.2, కేసముద్రంలో 31.6, నెల్లికుదురులో 20.4, నర్సింహులపేటలో 13.2, మరిపెడలో 9.6, తొర్రూరులో 16.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 


మరిపెడ రూరల్‌ : మరిపెడ, చిన్నగూడూరు మండ లాల్లో బుధవారం ఎడతెరిపిలేని ముసురు పెట్టింది. దీంతో చిన్నగూడూరు మండలంలోని జయ్యారం పెద్ద చెరువు, చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన తుమ్మల చెర్వు, మరిపెడ మండలంలోని బాబోజిగూడెం ఊరెంబడి చెరువులు మత్తడి పోస్తున్నాయి. రైతులు పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.





Updated Date - 2021-07-22T06:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising