ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొల్లెపల్లిలో పోడు రగడ

ABN, First Publish Date - 2021-07-27T05:13:06+05:30

బొల్లెపల్లిలో పోడు రగడ

అటవీ అధికారి కాళ్లు మొక్కుతున్న పోడు రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు రూరల్‌, జూలై 26 : మండలంలోని బొల్లెపల్లి గ్రామం లో పోడు భూముల రగడ మళ్లీ ప్రారంభమైంది. అటవీశాఖ అధికారులు మహబూబాబాద్‌ అటవీశాఖ రేంజ్‌ అధికారి ఆశాలత ఆధ్వర్యంలో పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆ పోడు భూము ల్లో అటవీ శాఖ సిబ్బంది ఒడిస్సా కూలీలతో మొక్కలు నాటుతుండగా దళిత రైతులు అడ్డుకు న్నారు. అటవీశాఖ, పోడు రైతుల మధ్య పోడు రగడ జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై సతీష్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రైతులు పెట్రోల్‌ బాటి ళ్లను చేతపట్టుకుని మమ్ములను చంపిన చస్తాం... పోడు భూములను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై సతీష్‌ పోడు రైతులతో పాటు అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోడు రైతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పోడు రైతులు మాత్రం బొల్లెపల్లి గ్రామంలో 120 ఎకరాలను నలబై సంవ త్సరాలుగా సాగు చేసుకుంటున్నామన్నారు. ఇందులో 70 ఎకరాలు గిరిజనులకు, 50 ఎకరాలు ఎస్సీ, బీసీలు పోడు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఈభూమి లో మొక్కలు నాటితే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని తమ గోడును వెళ్లబోసుకున్నారు.  అధికారుల కాళ్ల మీద పడిన కూడా కనికరించడం లేదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేంజ్‌ అధికారి ఆశాలత,సెక్షన్‌ అధికారులు బాలాజీ, రీనా, ఎఫ్‌డీవో కవిత పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising