ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేఔట్‌ లేకుండా కట్టడాలకు అనుమతి ఇవ్వొద్దు

ABN, First Publish Date - 2021-06-18T05:39:09+05:30

లేఔట్‌ లేకుండా కట్టడాలకు అనుమతి ఇవ్వొద్దు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ 

 మహబూబాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): లేఔట్‌ లేని ప్రాంతాల్లో అనధికార కట్టడాలను నిలిపివేసి అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జిల్లా స్ధాయి లేఔట్‌ కమిటీ, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీల పనితీరుపై సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. మహబూబాబాద్‌, తొర్రూరు. మరిపెడ మునిసిపాలిటీ అధికారులతో లేఔట్‌ స్థలాలపై చర్చించారు. మహబూబాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని శనిగపురం, తాళ్లపూసపల్లి, సాలార్‌తండా, జమాండ్లపల్లి పరిధిలో మునిసిపల్‌ స్థలాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...  టీఎస్‌ బీపాస్‌ ద్వారానే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమ తులు మంజూరు చేయాలన్నారు.  తహసీల్దార్‌ జారీ చేసే నాలా పత్రం, నీటి పారు దల శాఖ జారీ చేసిన నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌తో పాటు 10 శాతం గ్రీన్‌ల్యాండ్‌ స్థలం స్వాధీనం చేసుకున్న తర్వాత లేఔట్‌కు అనుమతి మంజూరు చేయాలన్నారు.   మునిసిపాలిటీల్లో ఉన్న స్థలాలపై మునిసిపల్‌ అధికారులకు పూర్తి అధికారం ఉంటుందని, రెవెన్యూ, పోలీస్‌ సహాకారంతో ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాలని సూచించారు. వ్యవసాయ భూమిని గజాల్లోకి మార్చేందుకు గాను లేఔట్‌ అవసరమని, అది లేకుండ రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్‌, కొమురయ్య, ఏఎస్పీ యోగేష్‌గౌతమ్‌, ఎస్సారెస్పీ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌, ముని సిపల్‌ కమిషనర్‌లు నరేందర్‌రెడ్డి, గుండె బాబు, గణేష్‌, టీపీవో నవీన్‌ పాల్గొన్నారు. 

మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు 

హరితహారం చేపట్టడం, జిల్లాలోని నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణలో నిర్ల క్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ హెచ్చరించారు.  కలెక్టర్‌ కార్యాలయంలో నర్సరీల నిర్వహణ, హరితహారంకు స్థలం కేటాయింపు అంశాలపై మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈసందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దేందుకు నర్సరీ లను ఏర్పాటు చేస్తుందన్నారు. నర్సరీల ముందుభాగంలో పరిశుభ్రంగా ఉంచుకోవా లని, ప్రతి నర్సరీకి తప్పనిసరిగా పేరు ఉండాలన్నారు. శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.  ఇంటింటి చెత్తసేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతిరోజు అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులను మెరుగుపర్చాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాం తాలు జలమయం కాకుండ చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, డీపీవో రఘువరణ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-18T05:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising