ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడికి అతడితో పెళ్లి!

ABN, First Publish Date - 2021-11-01T08:36:45+05:30

అతడంటే అతడికి ఇష్టం! అతడికి కూడా అంతే! ఆ ఇద్దరు యువకులు ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెలంగాణలో తొలి ‘గే’ వివాహం

ఏళ్లుగా సహజీవనం.. 

అంగీకరించిన పెద్దలు


హైదరాబాద్‌, అక్టోబరు 31: అతడంటే అతడికి ఇష్టం! అతడికి కూడా అంతే! ఆ ఇద్దరు యువకులు ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. తమ ఈ బంధాన్ని పెళ్లితో సుసంపన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ స్వలింగ సంపర్కుల వివాహం తెలంగాణలో జరగనుంది. తెలంగాణలో మొట్టమొదటి ‘గే’ వివాహం ఇదేనని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియో, ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఓ డేటింగ్‌ యాప్‌లో ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి పరిచయం అయింది. ఒక గంట పాటు చాటింగ్‌తోనే ఇద్దరూ ఒకరకంటే ఒకరు ఇష్టపడ్డారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులు సనాతన భారతీయ ధర్మాలను విశ్వసిస్తారని, తొలుత పెళ్లికి అంగీకరించలేదని.. సమయం తీసుకొని వారు అర్థం చేసుకునేలా చేశామని సుప్రియో చెప్పారు. మామూలు వివాహం మాదిరేగానే అన్ని పద్ధతులతో తమ పెళ్లి జరుగుతుందని, ఇప్పటికే షాపింగ్‌ మొదలు పెట్టామని, పెళ్లి ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లు జరిగినా, తెలంగాణలో మాత్రం ఇదే తొలిసారి అని చెప్పారు.  

Updated Date - 2021-11-01T08:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising