ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురిని అపహరించిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2021-11-08T00:33:46+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కుంట బ్లాక్‌ పరిధి బేటర్‌ గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కుంట బ్లాక్‌ పరిధి బేటర్‌ గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయుధులై గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు శుక్రవారం నలుగురిని, శనివారం మరొకరిని అపహరించినట్టు ఆదివారం ప్రచారం జరిగింది. వారు అపహరణకు గురై మూడు రోజులు గడుస్తున్నా వారి జాడ తెలవకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అపహరణకు గురైన వారికి ఎటువంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని సర్వ ఆదివాసీ సమాజ్‌ నేతలు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. కాగా మావోయిస్టులు గ్రామస్థులను తమ సమావేశాలకు తీసుకెళ్లారా, లేక ఏదైనా ఉద్దేశంతో అపహరించారా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-11-08T00:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising