ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల సంఘాలు పోరాటం మరువొద్దు

ABN, First Publish Date - 2021-01-27T05:29:13+05:30

కుల సంఘాలు పోరాటం మరువొద్దు

తిమ్మంపేటలో గోనె తిరుపతయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న కృష్ణమాదిగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగపేట, జనవరి 26 : కుల సంఘాల నాయకులు తమ జాతి హక్కులు, సంక్షేమం కోసం పోరాటాలను మరిచి పాలకుల పంచన చేరడం జాతి ద్రోహమవుతుందని, దీంతోనే కుల సంఘాలు అస్తిత్వాలను కోల్పోతున్నాయని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, ఎమ్‌ఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మంపేట, తొండ్యాల- లక్ష్మిపురం గ్రామంలో తుడుందెబ్బ జాతీయ నాయకుడు పొడెం రత్నం అధ్యక్షతన నిర్వహించిన దళిత, గిరిజనుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ స్థాయిలో ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధులు, సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు. తమ పోరాటాలను మార్గ దర్శకంగా చేసుకుని ఆవిర్భవించిన కులసంఘాలు, వాటి నాయకులు ఉద్యమాలను పక్కన పెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలకు వంత పడుతున్నారని విమర్శించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్‌, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చెరుకుల ధర్మయ్య, నాయకపోడ్‌ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బ సుధాకర్‌, నాయకపోడ్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లాల నాయకుడు చాద మల్లయ్య, ఆదివాసీ(గిరిజన) ఉద్యోగుల సంఘం జాతీ య నాయకుడు పొదెం కృష్ణప్రసాద్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు నెమలి నర్సయ్యమాదిగ, ఉమ్మడి జిల్లాల నాయకుడు వావిలాల స్వామి, ఆదివాసీ(గిరిజన )సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ 

మండలంలోని తొండ్యాల- లక్ష్మిపురానికి చెందిన ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకుడు పొదెం కృష్ణప్రసా ద్‌ తల్లి సమ్మక్క మృతి చెందగా మందకృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తిమ్మంపేట మాజీ సర్పంచ్‌ గో నే తిరుపతయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు.  

గోవిందరావుపేట : మండలంలోని పస్రా గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు మడిపెల్లి శ్యాంబాబు తల్లి రామక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబసభ్యులను కృష్ణమాదిగ పరామర్శించారు.

Updated Date - 2021-01-27T05:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising