రిజర్వేషన్ల వ్యతిరేకి పల్లా..
ABN, First Publish Date - 2021-03-12T07:05:27+05:30
రిజర్వేషన్ల వ్యతిరేకి పల్లా..
పీడిత వర్గాల గొంతుక చెరుకు సుధాకర్‌ను గెలిపించాలి: మంద కృష్ణ మాదిగపల్లా..
జనగామ టౌన్, మార్చి 11: తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య దక్కకుండా రిజర్వేషన్ల వ్యతిరేకిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రజలకు పిలుపు నిచ్చారు. పీడిత వర్గాల గొంతుక డాక్టర్ చెరుకు సుధాకర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన పట్టభద్రులను కోరారు. జనగామ జిల్లా కేంద్రం లోని విజయ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్‌తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రతినిధిగా పల్లా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ విద్య దక్కకుండా ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆరోపించారు. భూస్వాములకు ప్రతినిధిగా, అటు రైతులకు, ఇటు పేద వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేస్తున్న రాజేశ్వర్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కేజీ టు పీజీ విద్య అమలు చేయకుండా అడ్డుకున్న ఘనత పల్లాకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో భాగస్వామిగా పని చేస్తున్న తనను పోరుగడ్డ ప్రజలు ఓటుతో ఆదరించాలన్నారు. సమావేశంలో ఎంఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు సీసా శ్రీధర్ గౌడ్, నాయకులు ఇనుముల నర్సయ్య, ఉపేందర్, మాజిద్ మీర్జా, ఆనంద్, జేరిపోతుల సుధాకర్, నరేశ్, తాళ్లపల్లి కుమార్, వంశీకృష్ణ, సందెన రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-12T07:05:27+05:30 IST