ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-04-22T05:33:27+05:30

హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి

సమావేశంలో అభివాదం చేస్తున్న విద్యార్థి జాక్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మనవతారాయ్‌ 

కేయూ క్యాంపస్‌, ఏప్రిల్‌ 21 : హైదరాబాద్‌ను అన్ని జిల్లాలకు ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన జోనల్‌ వ్యవస్థ సీమాంధ్రులకు లబ్ధి చేకూర్చేలా ఉందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కె.మానవతారాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కేయూ అతిథి గృహం వద్ద జరిగిన సమావేశంలో కేయూ స్టూడెంట్‌ యూనియన్స్‌, జాక్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మానవతారాయ్‌  మాట్లాడారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  సీమాంధ్రుల పెత్తనాన్ని మొక్కలోనే తుంచివేయాలని పిలుపునిచ్చారు. టీఎ్‌సపీఎ్‌ససీకి తక్షణమే పూర్తి స్థాయి చైర్మన్‌తో పాటు ఇతర సభ్యులను నియమించాలని పేర్కొన్నారు. ఉద్యోగాల క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని డిమాండ్‌ చేశారు. మెటర్నిటీ, జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని పదేళ్ల వెసులుబాటు కల్పించిన జీవో 190ని అన్ని నోటిఫికేషన్లకు వర్తింపచేయాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియమాకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జాక్‌ నేతలు మేడ రంజిత్‌కుమార్‌, అలువాల కార్తీక్‌, మధు, కాడపాక రాజేందర్‌, వినోద్‌లోక్‌నాయక్‌, ఎమ్డీ పాషా, హుస్సేన్‌నాయక్‌, రాకేశ్‌, సావిత్రి, భాస్కర్‌, టీజీవీపీ, ఎన్‌ఎ్‌సయూఐ, బీఎ్‌సఎఫ్‌, ఎంఎ్‌సఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T05:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising