ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తకోట దంపతుల దారెటు?

ABN, First Publish Date - 2021-10-21T05:30:00+05:30

పాలమూరు జిల్లాలో రాజకీయ మార్పుల హడావుడి మొదలైంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తరహా మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమవుతోంది.

మదనాపురం మండలం కొత్తపల్లిలో పర్యటిస్తున్న దయాకరరెడ్డి, సీతమ్మ దంపతులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీని వీడేందుకు సిద్ధమైన సీతమ్మ, దయాకర్‌రెడ్డి

పార్టీ మారేందుకు ప్రజల బాట

మక్తల్‌, దేవరకద్ర నియోజకవర్గాల్లో పర్యటన

కార్యకర్తలు, గతంలో పార్టీని వీడిన నాయకులు, ఇతర పార్టీల నాయకులతో చర్చలు

ఏ పార్టీలో చేరాలో ప్రజలే నిర్ణయించాలంటోన్న దంపతులు

దసరా నుంచి ప్రారంభమైన పర్యటన

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఆహ్వానాలంటూ చర్చ

నెలాఖరులోగా పర్యటన ముగించి తుది నిర్ణయం

రాజకీయ వర్గాల్లో ఆసక్తి


పాలమూరు జిల్లాలో రాజకీయ మార్పుల హడావుడి మొదలైంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తరహా మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన కొత్తకోట దంపతులు తాజాగా రాజకీయ మార్పు వైపు అడుగులేస్తున్నారు. పార్టీలు మారేటప్పుడు రాజకీయ నాయకులు సహజంగా జరిపే ప్రక్రియకు భిన్నంగా ఈ దంపతులు గ్రామాలకు వెళ్ళి, పార్టీలకు అతీతంగా అక్కడి నాయకులను కలుస్తున్నారు. తాము ఏ పార్టీలో చేరాలో నిర్ణయించండని సలహాలడుగుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రతి గడపను తడుతూ అభిప్రాయాలు సేకరిస్తోన్న సీత, దయాకర్‌రెడ్డి దంపతులు.. మరోవైపు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఆహ్వానాలున్నాయని చెబుతున్నారు. దసరా నుంచి గ్రామాల పర్యటన ప్రారంభించిన వీరు ఈ నెలాఖరు వరకు రెండు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను చుట్టొచ్చి ప్రజలందరి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరేది తెలియజేస్తామని అంటున్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు వరకు పాలమూరు ఉమ్మడి జిల్లాలో కొత్తకోట సీతమ్మ, దయాకర్‌ రెడ్డి దంప తులు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్‌ సన్నిహితునిగా రాజకీయా ల్లోకి వచ్చిన దయాకర్‌రెడ్డి అమర చింత నియోజకవర్గం నుంచి 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1994, 1999లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2004లో ఓటమి పాలవగా, 2009లో నియోజకవర్గ పునర్విభజన తర్వాత అమరచింత రద్దవడంతో దయాకర్‌రెడ్డి మక్తల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించగా, ఆయన సతీమణి సీతమ్మ కొత్తగా ఏర్పాటయిన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009-14 సమయంలో దంపతులిద్దరూ ఒకే సమ యంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సీతమ్మ అంతకుమునుపు 2002-07 కాలంలో మహబూ బ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఈ దంపతులు 2014 ఎన్నికల్లోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో ప్రజా కూటమి నుంచి దయాకర్‌ రెడ్డి మక్తల్‌లో  పోటీ చేయగా, దేవరకద్రలో సీత పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌ అభ్యర్థికి ప్రచారం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతర పరిణామాల్లో రాష్ట్రంలో టీడీపీ క్రియాశీలకంగా లేకపోవడం, క్యాడర్‌ చెల్లాచెదురు కావడం, ఈ దంపతులు రాజకీయాల్లో ఉండాలంటే టీడీపీని వీడాలంటూ సన్నిహితులు, రాజకీయ మిత్రులు, అనుచరులు చేస్తున్న ఒత్తిడి మేరకు తాజాగా ఈ పర్యటన నిర్వహిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నామని దయాకర్‌రెడ్డి దంపతులు తమని కలిసిన నాయకులు, ఇతర ప్రముఖులకు స్పష్టం చేస్తున్నారు. 


సర్వత్రా ఆసక్తి

టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి విధేయులుగా ఉన్న దయాకర్‌రెడ్డి దంపతులు ఆరేడు నెలలుగా పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు నియామకమయ్యాక కనీసం ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన లేదు. అయితే తెలంగాణ ఆవిర్భావం నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీలో తనదైన వాదనను వినిపిస్తూ వస్తున్నారు. తెలంగాణలో సైతం పార్టీ బాధ్యతలను ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు కుటుంబాలకు చెందిన వారే నిర్వహిస్తే, కార్యకర్తల్లో పట్టు కొనసాగుతుందని, అందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడం వల్లే పార్టీలో అన్ని స్థాయిల్లో పని చేసిన నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడే పరిస్థితి నెలకొందనేది దయాకర్‌ రెడ్డి చెబుతున్నారు. ఆ క్రమంలో పార్టీలో ఎన్నిసార్లు తన వాదన వినిపించినా అది అరణ్యరోదనే అయ్యిందన్న ఆవేదనతో, నమ్ముకున్న కార్యక ర్తలు, నాయకుల సూచనల మేరకు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చామని దయాకర్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. వచ్చే ఎన్ని కల్లో తామిద్దరం పోటీ చేయడం ఖాయమంటోన్న వీరు ఏ పార్టీ నుంచి అనేది మాత్రం తేల్చడం లేదు. పర్యటనకు వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న కార్యకర్తలతో పాటు, గతంలో తమతో ఉండి ఆతర్వాత పార్టీ వీడిన వారిని సైతం కలుస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా మక్తల్‌ నియోజకవర్గంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంకేతంగా ఉండే మూడు రంగుల గుర్తులు వాడగా, దయాకర్‌రెడ్డి వాటిపై ఎలాంటి కామెంట్‌ చేయలేదు. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంలోనూ రాజకీయేతర కార్యక్రమం వలెనే నిర్వహించారే తప్ప ఎలాం టి ప్రకటనా చేయలేదు. తాజాగా గ్రామాల్లో పర్యటిస్తోన్న దయాకర్‌రెడ్డి, సీత దంపతులు  తమకు మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఆహ్వానాలు న్నాయని, కార్యకర్తలు, ప్రజలు ఏ పార్టీలో చేరమంటారోనని సలహాలు అడుగుతున్నారు. సహజంగా నాయకులు పార్టీ మారేటప్పుడు ఫలానా పార్టీలోకి వెళదాం, మనకి మంచి అవకాశాలుంటాయని కార్యకర్తల్ని కన్విన్స్‌ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా ఏపార్టీలో చేరాలో మీరే నిర్ణయించాలని ఎదురు ప్రశ్నిస్తుండడం అంద రిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. పార్టీ మారడం ఖాయమంటోన్న కొత్తకోట దంపతులు ప్రజాభిప్రాయం పేరుతో చివరకు ఏ పార్టీలో చేరుతారు? వారికి ఏ పార్టీ అవకాశం కల్పించబోతోంది అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising