ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN, First Publish Date - 2021-05-06T05:23:07+05:30

రైతులు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తామని రైతు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  రైతు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి

పెద్దమందడి, మే5: రైతులు పండించిన ప్రతీ గింజకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తామని  రైతు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.  మండలంలోని దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, జంగమా యపల్లి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను, తీవ్రమైన గాలులకు ఒరిగిన వరి పంటలను  జిల్లా రైతుబంధు జిల్లా అధ్యక్షుడు, నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వరలక్ష్మి, సిద్ధయ్య, శ్రీని వాస్‌రెడ్డి, జానకిరాములు, సుదర్శన్‌, మన్నెపురెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ నాగేందర్‌, మండల వ్యవసాయాధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

ఆత్మకూరు: రైతు పండించిన ప్రతీ గింజను కొను గోలు చేస్తామని వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ లీలా వతి అన్నారు. పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కె ట్‌లో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొను గోలు కేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. రైతులు కొ నుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, మునిసిపల్‌ వైస్‌ చై ర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, వైసీపీ కోటేశ్వర్‌, రైతు సమ న్వయ సమితి సభ్యుడు వీరేశలింగంతో పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

పాన్‌గల్‌: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొ నుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తోందని ఎంపీ టీసీ సభ్యులు రవికుమార్‌, నాగమ్మ, సర్పంచ్‌ లక్ష్మ య్య అన్నారు. మండలంలోని వెంగళాయిపల్లి, కదిరె పాడు, శాఖాపూర్‌ తండాలలో  ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన బుధవారం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఏపీఎం మద్దిలేటి, సీసీలు బాలశి వుడు, నాగరాజు, ఏఈవో నరేష్‌, బుక్‌ కీపర్‌లు శ్రీని వాసులు, కృష్ణయ్య, నాయకులు ఆంజనేయులు, రమేష్‌ గౌడ్‌, గోపాల్‌రెడ్డి, సుజీవన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising