ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌లో నీళ్లు

ABN, First Publish Date - 2021-10-19T04:55:53+05:30

డీజిల్‌లో నీళ్లు కలపడంతో తమ వాహనాలు సా ్టర్ట్‌ కావడం లేదని బాలానగర్‌ మండల కేంద్రం సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనదారులు సోమవారం ఆందోళనకు దిగారు.

బంక్‌ వద్ద ఆందోళనకు దిగిన వాహనదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ట్‌ కాని వాహనాలు

బాధితుల ఆందోళన


బాలానగర్‌, అక్టోబరు 18: డీజిల్‌లో నీళ్లు కలపడంతో తమ వాహనాలు సా ్టర్ట్‌ కావడం లేదని బాలానగర్‌ మండల కేంద్రం సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనదారులు సోమవారం ఆందోళనకు దిగారు. బంక్‌ వద్ద మండలంలోని రూప్‌సింగ్‌ తండాకు చెందిన రాజు తన ట్రాక్టర్‌లో డీజిల్‌ పోయించు కున్నాడు. తర్వాత ట్రాక్టర్‌ స్టార్‌ కాలేదు. దాంతో మెకానిక్‌ను తీసుకొచ్చాడు. డీజిల్‌ కల్తీ అయినందునే స్టార్ట్‌ కావడం లేదని చెప్పాడు. దాంతో ట్రాక్టర్‌లో ఉన్న డీజిల్‌ను బయటికి తీయగా, అందులో నీళ్లు కనిపించాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్‌ కూడా బంక్‌లో డీజిల్‌ పోయించుకోగా, ఆయన లారీ కూడా స్టార్ట్‌ కాలేదు. దాంతో ఆయన కూడా లారీలోంచి డీజిల్‌ బయటికి తీయగా, నీళ్లు కనిపించాయి. తర్వాత వేరే బంక్‌ నుంచి డీజిల్‌ తీసుకొచ్చి పోసి నా వాహనం స్టార్ట్‌ కాలేదు. మరో కారు, ఒక ఎక్స్‌కవేటర్‌లో డీజిల్‌ పోయిస్తే ఇలాగే జరిగింది. దాంతో వాహన దారులంతా బంక్‌ యజమాని జగదీష్‌కుమార్‌తో ఆందోళనకు దిగారు. దాంతో యజమాని వాహనాల ఇంజన్లు బాగు చేయిస్తానని చెప్పాడు. మెకానిక్‌ను పిలిపిస్తే ఒక్కో వాహనానికి రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చవుతుందని మెకానిక్‌ చెప్పడంతో అంత ఖర్చయితే తాను చేయించలేనని యజమాని చెప్పాడు. వర్షపు నీళ్లు వచ్చి డీజిల్‌లో కలిశాయని, నేనేమీ చేయలేనని అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాహనదారులు చెప్పారు.


Updated Date - 2021-10-19T04:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising