ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN, First Publish Date - 2021-10-30T04:26:46+05:30

ఇందిరాక్రాంతి పథకంలో వీవోఏలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వీవీ నర్సింహ్మ కోరారు.

డీఆర్‌డీవో పీడీ ఉమాదేవికి వినతి పత్రం అందిస్తున్న వీవోఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఆర్‌డీవో కార్యాలయం ముందు వీవోఏల నిరసన

    గద్వాల రూరల్‌, అక్టోబర్‌ 29 : ఇందిరాక్రాంతి పథకంలో వీవోఏలుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వీవీ నర్సింహ్మ కోరారు. డీఆర్‌డీవో కార్యాలయం ముందు వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, కార్యదర్శి డ్యామ్‌ అంజితో కలిసి వారు నిరసన వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి, మీటింగ్‌ల నిర్వహణ, బుక్‌కీపింగ్‌ల నిర్వాహణకు వీవోఏలు కృషి చేస్తున్నారని తెలిపారు. రుణాల మంజూరుకు కావల్సిన పత్రాల సమర్పణ, సకాలంలో చెల్లింపు తదితర వాటికి మహిళా సంఘాలకు వారు సహకరిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బీమా, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్‌డీవో ఉమాదేవికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీవోలు హనుమంతు, నాగరాజు, మహేష్‌, శ్రీను, కృష్ణారావు, మహేశ్వరమ్మ, మంగమ్మ, కృష్ణవేణి, తిమ్మప్ప, జయన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising