ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు

ABN, First Publish Date - 2021-05-09T04:10:16+05:30

స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు సన్నద్ధమవుతు న్నాయి. ఇప్పటికే గంగాపురం గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకోగా, ఈ నెల 10వ తేదీ నుంచి మండలంలోని వల్లూరు గ్రామంలో స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ను విధించాలని నిర్ణయించారు.

వల్లూరు గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌పై చర్చిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 12 నుంచి పట్టణంలో కిరాణా దుకాణాలు బంద్‌ 



జడ్చర్ల, మే 8 : స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు సన్నద్ధమవుతు న్నాయి. ఇప్పటికే గంగాపురం గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకోగా, ఈ నెల 10వ తేదీ నుంచి మండలంలోని వల్లూరు గ్రామంలో స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ను విధించాలని నిర్ణయించారు. వల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం సర్పంచ్‌ శ్రీను నాయకత్వంలో సమావేశం నిర్వహిం చారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోవాలని, అ నంతరం అన్ని దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. మాస్క్‌ ధరించ ని వారికి రూ.500 జరిమానా, దుకాణాలు తెరిచిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విఽధించేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ లక్ష్మణ్‌, పంచాయతీకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. 

జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి కిరాణదుకాణాలను స్వచ్చందంగా మూసివేసుకోనున్నట్లు కిరాణ అండ్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రకటించారు. 


రాజాపూర్‌లో..


రాజాపూర్‌ : రాజాపూర్‌లోని వ్యాపార సముదాయాలు 15 రోజులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని ముందుకు వచ్చారు. శనివారం నుంచి  వ్యాపారస్తులందరు తమ షాపులను  ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ అమలును ప్రతీ ఒక్కరు పాటించాలని శుక్రవారమే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానించుకున్నారు. శనివారం వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ చేసి మొదటి రోజు విజయవంతంగా చేశారు. అందుకు మండలంలోని ప్రజలందరు సహకరించాలని కోరారు. ప్రజలందరు మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, కరోనాను కట్టడి చేయడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని వ్యాపార సముదాయాల యజమానులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-09T04:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising