ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపయోగంగా రైతు వేదికలు

ABN, First Publish Date - 2021-05-11T04:39:02+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్మించిన రైతు వేదికలు నియోజవర్గంలో నిరు పయోగంగా మారాయి.

ఎల్లూరు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న రైతు వేదిక భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • - ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగించాలని డిమాండ్‌ 

కొల్లాపూర్‌ రూరల్‌, మే 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్మించిన రైతు వేదికలు నియోజవర్గంలో నిరు పయోగంగా మారాయి. కొల్లాపూర్‌ మండల పరిధిలో 9 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు కొన్ని రైతు వేదికలను ప్రారంభించారు. రైతు వేదికల భవనం లో అన్ని మౌలిక వసతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం క ల్పించింది. దాదాపు 500 మంది సామర్థ్యం గల రైతు వేదికలు ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం ఆశించిన ఫలి తం లేక నిరుపయోగంగా మారాయి.  రైతులకు యాసంగి, ఖరీఫ్‌ పంటలపె సూచనలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులు, మార్కెట్‌ విధి విధానలను తెలియజేసేలా రైతు వేదికలు ఉపయోగప డాలనేది ప్రభుత్వ ఆలోచన, కానీ ఆచరణలో మాత్రం ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి.  కరోనా సెకెండ్‌ వే విజృంభణ నైపథ్యంలో గ్రామాల్లో కూడా కొవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామాల్లో హోంఐసోలేషన్‌లో ఉన్న వారు నిబంధనలు పాటించకపోవడం మూలంగా కొవిడ్‌ కేసుల ఉదృతి కూడా పెరగడానికి కారణంగా మారింది.  దీంతో గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రైతు వేదిక భవనాలు చాలా చోట్ల ఊరు చివర్లో ఉన్నాయి. అంతే కాక వెంటిలేషన్‌, వాటర్‌, మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు. 

రైతు వేదిక భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి 

కొల్లాపూర్‌ నియోజవ ర్గంలో నిరుపయోగంగా ఉన్న రైతు వేదిక భవనా లను వినియోగంలోకి తీ సుకొని రావాలి. ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన   భవనాలు రైతులకు ఉప యోగపడే విధంగా వినియోగంలోకి రాలేదు. ప్రభు త్వం వెంటనే రైతు వేదిక భవనాలను రైతులకు అం దుబాటులోకి తీసుకోని రావాలి. 

-  బాలపీరు, రైతు సంఘం మండల కార్యదర్శి 

ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

నిరుపయోగంగా ఉన్న రైతు వేదిక భవనాలను కరోనా ఉదృత్తి తగ్గే వర కు ఐసోలేషన్‌ కేంద్రాలు గా ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో కొవిడ్‌ నిబంధ నలను పాటించక పోవ డం మూలంగానే కరోనా ఉదృత్తి పెరుగుతోంది. ప్ర భుత్వం ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రతీ కుటుంబానికి  నిత్యావసర సరుకులను ఉచి తంగా అందజేయాలి, ఆర్థిక సాయం చేయాలి. 

- మినీగ పరశురాములు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు  


Updated Date - 2021-05-11T04:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising