ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో నిరంకుశ పాలన

ABN, First Publish Date - 2022-01-01T04:32:03+05:30

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్‌ కోస్గి మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌ అన్నారు

కోస్గిలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ నాయకులు 

- రేవంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా

   కోస్గి, మద్దూరులలో సీఎం కేసీఆర్‌ 

   దిష్టిబొమ్మల దహనం

కోస్గి, డిసెంబర్‌ 31: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ పాలన  కొనసాగుతోందని కాంగ్రెస్‌ కోస్గి మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌కుమార్‌ అన్నారు  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లిలో రైతు సమస్యలపై వారికి మద్దతుగా వెళ్తున్న రేవంత్‌రెడ్డిని హౌజ్‌ అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో చరమగీతం తప్పదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నాగులపల్లినరేందర్‌, రఘువర్ధన్‌, తుడుంశ్రీనివాస్‌, రమేశ్‌రెడ్డి, బెజ్జురాములు, వార్లబాలరాజ్‌, నాగులపల్లినర్సిములు, ప్రతాప్‌, సలీం పాల్గొన్నారు. 

 మద్దూర్‌ పాత బస్టాండ్‌ ముందు..

మద్దూర్‌: టీపీసీసీ అధ్యక్షడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఏనుముల రేవంత్‌ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ మండల నా యకుల ఆధ్వర్యంలో  శు క్రవారం ధర్నా నిర్వ హించారు.  ఈ సంద ర్భంగా జడ్పీటీసీ సభ్యుడు రఘుపతి రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వై ఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండ టం వల్లనే  రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం అక్రమ అరెస్టు, గృహ నిర్బంధాలుకు పాలుపడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వంపై ప్రజల విశ్వాసం తగ్గుతుండడంతోనే ఇలాం టి దురాగాతాలకు పాలుపడుతోందన్నారు. అంతకు ముండు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక పాత బస్టాండ్‌లో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు నర్సింహ, మల్లికార్జున్‌, మైపాల్‌గౌడ్‌, శివరాజ, బాల్‌ రాజ్‌,  భీములు, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, సంజీవ్‌, చంద్రమోహన్‌ గణపతి శ్రీనివాస్‌, బాబు, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T04:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising