ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మిలాద్‌ ఉన్‌ నబీ

ABN, First Publish Date - 2021-10-19T05:09:13+05:30

మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ వేడుకలను మైనార్టీలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేప ట్టారు.

ముస్తాబైన పేటలోని జామా మస్జీద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన మస్జీద్‌లు

నారాయణపేట, అక్టోబరు 18 : మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ వేడుకలను మైనార్టీలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేప ట్టారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోను న్నారు. ఇప్పటికే జిల్లాలోని మక్తల్‌, కోస్గి, ఊట్కూర్‌, నారాయణపేట తదితర మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రమైన నారాయణపేటలో మస్జీ ద్‌లను విద్యుత్‌దీపాలతో ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలో 14 మస్జీద్‌లు ఉన్నా అందులో ముఖ్య మైనవి జామా, లాల్‌ మస్జీద్‌, మక్కా మస్జీద్‌, మదీనా మస్జీద్‌, హాజిఖాన్‌ పేట్‌, టెక్కిరి మస్జీద్‌, ఫిరోదోస్‌ మస్జీద్‌ ఉన్నాయి. ఆయా మస్జీద్‌లకు వివిధ ప్రాంతాల నుంచి మౌలానాలు వచ్చి మహ్మద్‌ ప్రవక్త జీవిత విశేషాల ప్రధాన ఘట్టాలను మస్జీద్‌లలో అధ్యాత్మీక ప్రవచనంలో వివరిస్తారు. మంగళవారం నారాయణపేటలో పండుగ రోజు ఉదయం 9 గంటలకు లాల్‌ మస్జీద్‌ నుంచి మిలాద్‌ ఉన్‌ నబీ కమిటీ, బువ్వమ్మ గుట్ట దర్గా పీఠా ధిపతి గయాసుద్దిన్‌ ఖాద్రి ఆధ్వర్యంలో మైనార్టీలు పుర వీధుల గుండా భారీ ర్యాలీతో బువ్వమ్మ గుట్టకు చేరుకుంటారు. మైనార్టీల ర్యాలీలో వచ్చే వారికి ప్రధాన కూడళ్లలో అన్నీ రాజకీయ పార్టీల నాయకులు వేదికలను ఏర్పాటు చేసి స్వాగతం పలకడంతో పాటు జ్యూస్‌, నీటి పాకెట్లను అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు.


Updated Date - 2021-10-19T05:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising