ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-11-27T04:23:34+05:30

దేశంలో రైతులు పడుతున్న కష్టాలు తీరే మార్గం చూపించడం కోసం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల నివేదికను వెంట నే అమలు చేయాలని సినీనటుడు ఆర్‌ నారాయణ మూర్తి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ నారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి టౌన్‌, నవంబరు 26: దేశంలో రైతులు పడుతున్న కష్టాలు తీరే మార్గం చూపించడం కోసం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల నివేదికను వెంట నే అమలు చేయాలని సినీనటుడు ఆర్‌ నారాయణ మూర్తి కోరారు.  శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల స మావేశంలో మాట్లాడారు. 36 సంవత్సరాలుగా రైతు ల తరుపున సినిమాలు చేస్తున్నాని అన్నారు. ఏ ఒక్కరోజు తన సినిమా చూడాలని కోరలేదని, ప్రస్తు తం రైతులు పడుతున్న ఇబ్బందులను ఇతివృత్తంగా  తీసిన సినిమా కాబట్టి రైతన్న చిత్రాన్ని ప్రతీ ఒక్కరు  ఆదరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలపై ఇప్పటికే ప్రభుత్వంతో రైతులు 11 సార్లు చర్చలు జరిపారని, అయినా ప్రభు త్వం దిగి రాలేదన్నారు.  ఈ మధ్య కాలంలో ప్రధా న మంత్రి నరేంద్రమోడీ నల్ల చట్టాలను ఉపసంహ రించు కుంటున్నట్లు ప్రక టించడంతో పాటు దేశ ప్రజలకు క్షమాపణ చెప్ప డాన్ని స్వాగతిస్తున్నా మని అన్నారు. మూడు చట్టా లను రద్దు చేసినంత మా త్రన సరిపోదని, విద్యుత్‌ సవరణ చట్టంతో పాటు కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన అక్రమ కేసు లపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  ఆల్‌ ఇండియా కిసాన్‌ మోర్చా రైతుల గు రించి ఏవైతే చెబుతుందో వాటినే ఇతివృత్తంగా చేసుకుని రైతన్న చిత్రాన్ని తీశానని, ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ సమావే శంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, డి చంద్రయ్య, బాల్‌రెడ్డి, గణేష్‌, డి కురుమయ్య, నందిమల్ల రాములు, మండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T04:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising