ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలి

ABN, First Publish Date - 2021-12-08T04:15:50+05:30

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు.

కోస్గిలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

కోస్గి, డిసెంబరు 7 : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజ్ఞ జూనియర్‌ కళాశాల నుంచి శివాజీ చౌరస్తా మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2019-20, 21 సంవత్సరాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్‌ విద్యార్థులకు పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. గతంలో ఆంధ్ర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వడం కుదరదు, అవసరం అనుకుంటే తెలంగాణ విద్యార్థులకు పాకెట్‌ మని అందిస్తామన్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ విడుదల చేయ కుంటే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమాలకు సిద్ధం అవుతామన్నారు. అనంతరం వివిధ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ రమేష్‌కు అందించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కోషాధికారి గౌస్‌, జిల్లా నాయకులు శ్రీహరి,  మాజీ ఉపాధ్యక్షుడు అంజి, కోస్గి అధ్యక్షుడు మహేశ్‌, కార్యదర్శి మల్లేశ్‌, నాయకులు ఆంజనేయులు, శ్రీను, శిరీష, పూజ, విద్యార్థులు పాల్గొన్నారు. 

నారాయణపేట టౌన్‌ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం దామరగిద్ద తహసీల్దార్‌ కార్యాలయం ముందు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎయూ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడు తూ డిగ్రీ, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు స్కా లర్‌షిప్‌పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారని వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్ర మంలో నాయకులు బాల్‌రాజ్‌, గణేష్‌, వెంకటేష్‌, శ్రీహరి, తార, లక్ష్మిదేవి ఉన్నారు. 


Updated Date - 2021-12-08T04:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising