ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిలాఫలకంపై ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని తొలగించాలి

ABN, First Publish Date - 2021-08-04T04:55:23+05:30

మండలంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖచిత్రాన్ని వెంటనే తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ డిమాండ్‌ చే శారు.

మద్దిమడుగులో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదర, ఆగస్టు 3 : మండలంలోని మద్దిమడుగు పుణ్యక్షేత్రం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖచిత్రాన్ని వెంటనే తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ  డిమాండ్‌ చే శారు.  మంగళవారం కాంగ్రెస్‌ కార్యకర్తల ఆధ్వర్యం లో  మద్దిమడుగు పుణ్య క్షేత్రంలోని పబ్బతి ఆంజనే యస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవి అనుభవిస్తూ ఈ ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయలేదని, హామీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. దే వస్థాన చైర్మన్‌, అధికారులు జరిగిన తప్పిదాన్ని వా రం రోజుల్లో సరి చేసుకోవాలని, లేనియేడల ప్రజ లు, భక్తుల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించా రు.  ఆలయాన్ని నమ్ముకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాదారులకు అటవీశాఖ అధికారులచే నోటీసులు ఇప్పిస్తూ భయాబ్రాంతాలకు గురి చేయ డం సరైన పద్ధతి కాదని హితువు పలికారు. కాంగ్రె స్‌ పార్టీ అధికారంలోకి వస్తే షాపింగ్‌ కాంప్లెక్స్‌ క ట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పదర, అమ్రాబాద్‌ మండల అధ్యక్షుడు ఏఆర్‌.యా దవ్‌, బుచ్చయ్య, అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T04:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising