ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్టర్ల మాయ!

ABN, First Publish Date - 2021-04-24T05:03:07+05:30

ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి భూగర్భ జలాల వృద్ధికి చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, సాగునీటి అవసరాలకు కాలువల (ఫీడర్‌ చానల్‌) నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా రైతులు పంటలు పండించుకోవడానికి వీలు కల్పించింది.

ముచ్చర్లపల్లి పెద్ద చెరువు కాలువ (ఫీడర్‌ చానల్‌) మాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆమ్యామ్యాల మత్తులో అధికారులు

- రాత్రికి రాత్రే జల వనరులను ధ్వంసం చేస్తున్న రియల్టర్లు


ఊర్కొండ, ఏప్రిల్‌ 23: ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి భూగర్భ జలాల వృద్ధికి చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, సాగునీటి అవసరాలకు కాలువల (ఫీడర్‌ చానల్‌) నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా రైతులు పంటలు పండించుకోవడానికి వీలు కల్పించింది. అయితే, వీటిపై రియల్టర్ల కన్ను పడింది. వీటిని ధ్వంసం చేస్తూ వెంచర్లుగా మలుస్తుండటం గమనార్హం. రాష్ట్ర రాజధానికి ఊర్కొండ మండలం సమీపంలో ఉండటంతో పాటు రీజనల్‌ రోడ్డు వస్తుందని.. మండలంలో భూముల ధరలకు రెక్కలు వ చ్చాయి. దీంతో రియల్టర్లు భూములు కొనుగోలు చేసి రాత్రికి రాత్రే యం త్రాల సహాయంతో చదును చేస్తూ ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, ఫీడర్‌ చానళ్లు ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని ముచ్చర్లపల్లి పెద్ద చెరువు ఫీడర్‌ చానల్‌, ఊర్కొండపేట శివారులోని చెక్‌డ్యాం, జకినాలపల్లి శివారు లోని ఊటకుంటను మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రియల్టర్లు నేలమట్టం చేశా రు. ప్రభుత్వం ద్వారా నిర్మాణాలు ఉన్న చెక్‌డ్యాంలు, ఊటకుంటలు, ఫీడ ర్‌ చానల్స్‌ ఉన్న భూములు తక్కువ ధరకు లభిస్తుండటంతో రియల్టర్లు కొనుగోలు చేసి భూమి చదును పేరుతో ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేస్తున్నారని పరిసర ప్రాంతాల రైతులు అధికారులకు తెలియజేసినా మా శాఖకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపం తో ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి చేపట్టిన నిర్మాణాలు నేలమట్టం అవు తున్నాయి. రియల్టర్లు అధికారులను ముందస్తుగా కలవడంతోనే రైతులు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు న్నాయి. జల వనరులను కాపాడకపోతే భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికా రులు ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

 



Updated Date - 2021-04-24T05:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising