ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-24T04:33:10+05:30

మండలంలోని బండరావిపాకుల గ్రామంలో ఇల్లు కూలి మృతి చెందిన సర్పంచ్‌ కుటుం బాన్ని ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ నాయకుల డిమాండ్‌  - బండరావిపాకులలో నిరసన 

రేవల్లి, జూన్‌ 23: మండలంలోని బండరావిపాకుల గ్రామంలో ఇల్లు కూలి మృతి చెందిన సర్పంచ్‌ కుటుం బాన్ని ఆదుకోవాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా మం డల బీజేపీ నాయకులు గ్రామానికి వచ్చారు. సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఆమె మనమడు భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుం బానికి రూ. 50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డి మాండ్‌ చేశారు. అనంతరం గ్రామస్థులతో రోడ్డుపై ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయ కులు మాట్లాడుతూ చుట్టు పక్కల రిజర్వాయర్‌ నిర్మా ణాలో బ్లాస్టింగ్‌ చేయడం వల్ల చాలా ఇళ్లు దెబ్బ తిం టున్నాయన్నారు. అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్లకు ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేద న్నారు. గతంలో కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చే యగా ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇప్పిస్తామని కలెక్ట ర్‌ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్ప టికైనా ముంపునకు గురవుతున్న ఇళ్లకు నష్టపరిహా రం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ, బీజేపీ రాష్ట్ర బీసీ సంఘం అధికార ప్రతినిధి శ్రీశైలం,  జిల్లా కార్యదర్శి పరశురాము,  పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్‌, మం డల అధ్యక్షుడు అజయ్‌గౌడ్‌, నాయకులు మహేందర్‌,  జమలయ్య, పరశురాము, సాయిశంకర్‌ పాల్గొన్నారు.

  ఎక్స్‌గ్రే షియా చెల్లించాలి

 రేవల్లి మండల పరిధిలోని బండరాయిపాకుల గ్రామ సర్పంచ్‌ గంగమోని లచ్చమ్మ కుటుంబానికి  రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం  జిల్లా కమిటీ సభ్యుడు గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పరమేశ్వచారి  డిమాండ్‌ చేశారు.  ఇంటి మిద్దె కూలి ప్రమాదవశాత్తు మృతి చెందిన సర్పంచ్‌ లచ్చమ్మ, మనవడు యోగేశ్వర్‌ కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథ కంలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపు గ్రామమైన బండరాయిపాకుల ప్రజలకు నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలని డిమాండ్‌ చే శారు. ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మ ట్టి మిద్దెలు కూలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-06-24T04:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising