ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి

ABN, First Publish Date - 2021-06-24T04:27:53+05:30

ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీని అరి కట్టాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌ చంద్ర డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ కూడలిలో ర్యాలీగా వస్తున్న బీజేవైఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో


కందనూలు, జూన్‌ 23: ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీని అరి కట్టాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌ చంద్ర డిమాండ్‌ చేశారు. బుధ వారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో బీజేవైఎం ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రా ష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరో క్షంగా ఎంతో మంది జీవితాలపై తీవ్రప్రభావాలు పడి ఇబ్బందులకు గుర య్యారన్నారు. అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడి విపత్కర పరిస్థితుల్లో కూడా కార్పొ రేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థు లు, వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. గత సంవత్స రం ఫీజులు పెంచవద్దని జీవో నెంబరు 46జారీ చేసినా అది కేవలం కాగితా లకే పరిమితమైందని, ఈ సంవత్సరం కూడా ఎలాంటి నిబంధనలు పాటించ కుండా అక్రమ  ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి లాభపేక్ష లేకుం డా విద్యనందించాల్సిన యజమాన్యాలు ధనార్జనే లక్ష్యంగా రంగురంగుల ప్రక టనలతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్‌ మొద లు ట్యూషన్‌ ఫీజుతో సహా ఎన్నో రకాల ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణీత ఫీజులు నిర్ణయించి పాఠశాలల ముందు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కాలంలో ఫీజులు పెంచకుండా వా యిదా రూపంలో చెల్లించేందుకు తీసుకొచ్చిన 46జీవోను అమలు పరచాలన్నా రు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు రామోజీ, పర్వతాలు, చందులాల్‌, విజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, చందు, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఆనంద్‌, అంజి, సత్యం, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising