ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్న రోడ్డునే విస్తరించాలి

ABN, First Publish Date - 2021-09-04T04:08:49+05:30

కోదాడ-జడ్చర్ల జాతీయ రాహదారిలో భాగంగా చార కొండలో చేపట్టిన బైపాస్‌ అలైన్మెంట్‌ రోడ్డు కాకుండా ప్రస్తుతం ఉన్నరోడ్డునే విస్త రించాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

అధికారులతో కలిసి రోడ్డును పరిశీలిస్తున్న జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి


చారకొండ, సెప్టెంబరు 3: కోదాడ-జడ్చర్ల జాతీయ రాహదారిలో భాగంగా చార కొండలో చేపట్టిన బైపాస్‌ అలైన్మెంట్‌ రోడ్డు కాకుండా ప్రస్తుతం ఉన్నరోడ్డునే విస్త రించాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. శుక్రవారం  చారకొండలో బైపాస్‌ రోడ్డు వల్ల కోల్పోతున్న బాధితుల ఇండ్లను జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరిస్తే ప్రజలకు ఎలాంటి నష్టం జరగదని అధికారులు రీ సర్వే చేసి ప్రజలు నష్టపోకుండా ఉన్న రోడ్డును విస్తరించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైనా చారకొండ మండలం ఇపుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కల్వకుర్తి నుంచి దేవరకొండ వరకు చాలా మూలమలుపులు ఉన్న ఎ క్కడా వాటిని సరిచేయకుండా కేవలం చారకొండలో రెండు మూలమలుపులు, బ్రిడ్జిని చూపించి బైపాస్‌ అలైన్మెంట్‌ రోడ్డు విస్తరించడానికి సర్వేలు చేయడం ఏం టని అధికారులను ప్రశ్నించారు. బైపాస్‌ అలైన్మెంట్‌ రోడ్డును విస్తరించిన మూలమలుపులే ఉన్నాయని అన్నారు. ఈనెల 6,7వ తేదీలలో ఢిల్లీ నేషనల్‌ హైవే అధికారులతో సమావేశం ఏర్పాటు చే స్తామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న రోడ్డును అధికా రులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు నష్టం చేకూర్చాలనేది ప్రభుత్వ అభిమతం కాదని, జాతీయ రాహదారిని ఇది వరకే ఇంజనీర్లు రెండు మూడు రకాలుగా రూపోందించిన అలైన్మెంట్‌లను పరిశీలించి భవిషత్తులో ప్రమాదాలను నివారించే విధంగా తగిన అలైన్మెంట్‌కు అనుగుణంగా భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. భూసేకరణలో సైతం ఇళ్లు కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి, ఆర్డీవో రాజేష్‌కుమార్‌, తహసీల్దార్‌ నాగమణి, నేషనల్‌ హైవే ఏఈ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-04T04:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising