ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బార్‌ల దరఖాస్తుకు రేపు చివరి గడువు

ABN, First Publish Date - 2021-02-07T03:21:24+05:30

ఉమ్మడి జిల్లాలోని కొత్త మునిసిపాలిటీలలో బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనుంది.

భూత్పూర్‌ బార్‌కు దరఖాస్తు చేస్తున్న వ్యాపారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 6: ఉమ్మడి జిల్లాలోని కొత్త మునిసిపాలిటీలలో బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనుంది. గత నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా శనివారం వరకు 132 వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మునిసిపాలిటీలకు బార్లు మంజూరు అయ్యాయి. పలు చోట్ల వ్యాపారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీటికి పెద్ద ఎత్తున దరఖాస్తులు పడుతున్నాయి. భూత్పూర్‌ బార్‌కు అత్యధికంగా 32 దరఖాస్తులు వచ్చాయి. అయిజ బార్‌కు 5, అలంపూర్‌కు 21, వడ్డేపల్లికి 21, మక్తల్‌కు 15, కోస్గికి 18, కొల్లాపూర్‌కు 2, పెబ్బేరుకు 16 దరఖాస్తులు రాగా, ఆత్మకూర్‌, అమరచింతలో మాత్రం ఒక్కో దరఖాస్తు మాత్రమే దాఖలైంది. శనివారం ఒక్కరోజే 65 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఆదివారం దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దరకాస్తులను పరిశీలించి, ఈ నెల10న ఆయా జిల్లాల కలెక్టర్‌ల సమక్షంలో లక్కీడిప్‌ తీయనున్నారు. డ్రాలో దుకాణం దక్కించుకున్నవారు అప్పుడే లైసెన్స్‌ ఫీజు రూ.30 లక్షలలో మూడోవంతు అంటే రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-02-07T03:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising