పిడుగుపాటుకు ఎద్దు మృతి
ABN, First Publish Date - 2021-06-07T04:34:46+05:30
పిడుగుపడి ఎద్దు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పరిధిలోని పడమటి తండాలో చోటుచేసుకున్నది.
మృతి చెందిన ఎద్దు వద్ద రోధిస్తున్న బాల్యనాయక్, కుటుంబ సభ్యులు
చారకొండ, జూన్ 6: పిడుగుపడి ఎద్దు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పరిధిలోని పడమటి తండాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పడమటి తండాకు చెందిన కొర్ర బాల్యనాయక్ ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలంలో ఎద్దులను కట్టేసి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పిడుగుపడి కాడెద్దు మృతి చెందింది. బాధిత రైతును సర్పంచ్ గోలి రంగారెడ్డి పరామ ర్శించారు. విత్తనాలు వేసే సమయంలో కాడెద్దు మృతి చెందడం బాధకరమన్నారు. రైతు కు టుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Updated Date - 2021-06-07T04:34:46+05:30 IST