ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్టుల్లేవ్‌.. మందుల్లేవ్‌!

ABN, First Publish Date - 2021-04-24T05:05:22+05:30

కరోనా వేళ ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు సమస్యలతో సావాసం చేస్తున్నారు.

వనపర్తి జిల్లా ఆస్పత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేధిస్తున్న మందుల కొరత

- నిలిచిపోయిన బీకాంప్లెక్స్‌, మల్టీ విటమిన్‌, ఇన్సులిన్ల సరఫరా

- పీహెచ్‌సీలకు ఆరు నెలలుగా సరఫరా లేని విరేచనాల మెడిసిన్‌

- షుగర్‌, యూరియా టెస్టులకు ప్రైవేట్‌కు రెఫర్‌

- ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక ఇబ్బందుల్లో రోగులు


వనపర్తి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : కరోనా వేళ ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. మందులతో పాటు రోగ నిర్ధారణ పరీక్షల కూ ప్రైవేట్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. సమస్యలను గుర్తించి వెంటనే సరిది ద్దుకోవాల్సిన అవసరమున్నా, ఎవరూ ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు. అతి తక్కువ ధరకే దొరికే మందులను కూడా సరఫరా చేయకపోవ డం, పాడైపోయిన రోగ నిర్ధారణ యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చే యకపోవడం వల్ల కొన్ని రోజులుగా వైద్యులు వాటి కోసం రోగులను ప్రైవే ట్‌కు రెఫర్‌ చేస్తున్నారు.


మందుల కొరత తీవ్రం

వనపర్తిలో జిల్లా ఆస్పత్రితో పాటు రెండు సీహెచ్‌సీలు, 13 పీహె చ్‌సీలు, రెండు ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి, రేవల్లి సీహెచ్‌సీ వైద్య విధాన పరిషత్‌లో, ఆత్మకూరు సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు వైద్యారోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. జబ్బులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చే మెజారిటీ రోగులకు బీకాంప్లెక్స్‌, మల్టీ విటమిన్‌ మాత్రలు ఇస్తుంటా రు. కానీ, జిల్లా ఆస్పత్రిలో రెండు నెలలకు పైగా బీకాంప్లెక్స్‌, మల్టీ విటమిన్‌ మాత్రల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం నుంచి సరఫ రా నిలిచిపోవడంతో వైద్యులు ప్రైవేట్‌లో వాటిని కొనుగోలు చే యాల్సిందిగా రోగులకు సూచిస్తున్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్థులకు ఇ చ్చే ఇన్సూలిన్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇన్‌పేషంట్లకు ఇ న్సులిన్‌ ఇస్తున్నా, ఔట్‌ పేషంట్లకు ఇవ్వడం లేదు. హ్యూమన్‌ మిక్షర్డ్‌ ఇన్సులిన్‌ అందుబాటులో లేదు. కేవలం ప్లేన్‌ ఇన్సులి న్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ పరిఽ దిలో ఉండే పీహెచ్‌సీల్లో గాయాలకు పూసే బెటాడిన్‌, పోవాడి న్‌, సొప్రో మెడిసిన్‌ అయింట్‌మెంట్లు అందుబాటులో లేవు. ఒ ళ్లు నొప్పులకు ఇచ్చే డైక్లోపినాక్‌, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఇచ్చే జల్‌సిల్‌ సిరప్‌ అందుబాటులో లేవు. వేసవిలో ఎక్కువగా ఎండకు తిరిగే వారికి వాంతులు, వి రేచనాలు అవుతుంటాయి. ఎక్కువ మంది ఈ మందుల కోసం ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. అయితే, ఆరు నెలలుగా పీహెచ్‌సీలకు విరేచనాల మాత్రల సరఫరా లే దు. వీటినీ కూడా బాధితులు బయటే కొంటున్నారు.


షుగర్‌ టెస్టుకు బయటికే..

జిల్లా ఆస్పత్రిలో ప్రధానంగా రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఇబ్బం దులు ఇటీవల ఎక్కువవుతున్నాయి. షుగర్‌ లెవల్స్‌ నిర్ధారణకు ఉపయోగించే బ యోకెమిస్ర్టీ అనలైజర్‌ కొద్ది రోజుల కిందట పాడైపోయింది. గతంలోనే పలుమా ర్లు రిపేర్లు చేసి నడిపించినా, 15 రోజుల నుంచి పరీక్షల నిర్వహణ జరగడం లే దు. ఇదే మిషన్‌పై షుగర్‌తోపాటు యూరియా, క్రియాటిన్‌, జాండిస్‌, యూరిక్‌ యాసిడ్‌ పరీక్షలు కూడా చేస్తారు. మిషన్‌ పాడవడంతో అన్ని పరీక్షలకు ప్రైవేట్‌ డయాగ్నాస్టిక్‌ కేంద్రాలకు వైద్యులు రెఫర్‌ చేస్తున్నారు. ఇప్పటికే షుగర్‌ ఇ న్సూలిన్‌ కొరత ఉండటం, షుగర్‌ లెవల్‌ చెక్‌ చేసే యంత్రం పాడవడంతో సం బంధిత రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మిషన్‌కు రూ.2 లక్షలు ఖర్చు కానుంది. అలాగే ప్లేట్‌లేట్స్‌, సీబీపీ తదితర పరీక్షలు చేసే సెల్‌ కౌంటర్‌ కూడా 2015లో తెచ్చారు. అది పాతబడటంతో ఇబ్బంది ఉంది. సెల్‌కౌంటర్‌, బయెకెమి స్ర్టీ అనలైజర్‌ ఉపయోగం ఎక్కువగా నెల వారీ పరీక్షల కోసం వచ్చే గర్భిణుల కు అవసరం ఉంటుంది. ఇవి పని చేయకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు ప డుతున్నారు. కొత్త రోగ నిర్ధారణ యంత్రాలు సమకూర్చి, రోగులకు కచ్చితంగా అ వసరమ్యే మందులను తక్షణమే సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-04-24T05:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising