ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

ABN, First Publish Date - 2021-11-28T04:54:00+05:30

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఆలయంలో కుంకుమార్చనలో పాల్గొన్న దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అలంపూరు, నవంబరు 27 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన  జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.  కార్తీక మాసంలో భాగంగా శనివారం వివిధ సుదూర ప్రాం తాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి, అమ్మవారి ఆ లయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు భ క్తులు వేకువజామునే తుంగభద్ర నదిలో పుణ్యస్నా నా లు ఆచరించిన అనంతరం కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. అనంతరం అమ్మవారికి, స్వామివారికి భక్తులు ముడుపులను   సమర్పించారు. బాలబ్రహ్మేశ్వ ర స్వామి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. 

- అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన  జోగు ళాంబదేవి అమ్మవారి చరిత్రపై వాల్మీకి రాముడు (దర్శకుడు) తీస్తున సినిమా టీజర్‌ను శనివారం అలం పూరు ఎమ్మెల్యే అబ్రహాం విడుదల చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే జోగుళాంబదేవి, బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం జో గుళాంబ చరిత్ర (ఆదిపరాశక్తి) టీజర్‌ను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అమ్మ వారి చరిత్రపై సినిమా తీస్తున్నందున చాలా సంతోషం గా ఉందన్నారు. అనంతరం దర్శకుడు వాల్మీకి రాముడు ను శాలువాతో కప్పి అభినందించారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేషం, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనందశర్మ, మాజీ ఆలయ చైర్మన్‌ నారాయణ రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ  పాల్గొన్నారు. 

- ఆయాలను సినీ దర్శకుడు,  నిర్మాత బండ్ల గణేష్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  అంతకుముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు.  ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం వారికి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆలయ విశిష్టతలను అర్చకులు వివరించారు. అలాగే  తెలం గాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌యార్డు జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా స్వామివారి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట అలంపూరు మార్కెట్‌ యార్డు సెక్రటరీ అనిల్‌కుమార్‌, నరసింహులు, భాస్కర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 








Updated Date - 2021-11-28T04:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising