ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి తెలంగాణ ఆదర్శం

ABN, First Publish Date - 2021-10-30T04:39:56+05:30

దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ అ న్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకద్ర, అక్టోబరు 29 : దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ అ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీనివాసగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమాశం ఏర్పాటు చేశారు. ముందుగా వీరప్పయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించి దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 20ఏళ్లు అయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పదివేల మంది కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ గ్రామం నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ అన్నపూర్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ కొండా సుగుణ, నాయకులు శ్రీకాంత్‌ యాదవ్‌, కొండా శ్రీను నరేందర్‌రెడ్డి, కొండారెడ్డి, యుగేంధర్‌రెడ్డి, రాధాకృష్ణ, చల్మారెడ్డి,  వైస్‌ ఎంపీపీ, వివిధ మండలాలఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising