ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలువు రాళ్లను పరిశీలించిన సర్వేయర్‌

ABN, First Publish Date - 2021-07-30T04:32:26+05:30

మండలంలోని మూడుమాల్‌ గ్రామ శివారులో ఉన్న నిలువు రాళ్లను ఖగోళ పరిజ్ఞానం జిల్లా సర్వే అధికారి శ్రీరామ్‌ గురువారం పరిశీలించారు.

నిలువురాళ్లను పరిశీలిస్తున్న జిల్లా సర్వేయర్‌ శ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ, జూలై 29 : మండలంలోని మూడుమాల్‌ గ్రామ శివారులో ఉన్న నిలువు రాళ్లను ఖగోళ పరిజ్ఞానం జిల్లా సర్వే అధికారి శ్రీరామ్‌ గురువారం పరిశీలించారు. సుమారు 3500 ఏళ్ల క్రితమే విశ్లేషకులు పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారనడానికి ఈ ప్రాంతం నిదర్శనం అన్నారు. ఇక్కడ వరుస క్రమంలో 12, 14అడుగుల ఎత్తులో ఉన్న నిలువు రాళ్లు ఉత్తరాయణ దక్షిణాయన కాలాన్ని సూర్యుని ఆధారంగా గ్రహించడానికి ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో నిలువురాళ్లును సూర్యునికి అభి ముఖంగా ఉంచి వాటిని ఆధారంగా తమ క్యాలెండర్‌ నిర్ధారించు కునే వారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక రాతి పై చెక్కబడిన గుర్తులు ఆకాశంలోని సప్తవర్ణ మండలాన్ని పోలి ఉండడాన్ని గుర్తించారు. ఇటువంటి ప్రదేశం ఆసియా ఖండంలో మరెక్కడా లేదన్నారు. నిలువురాళ్ల ప్రాంతం ఆక్రమణకు గురి కాకుండా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని మండల సర్వేయర్‌కు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో మండల ఉప తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, సర్వేయర్‌ మల్లేష్‌, సందీప్‌, వీఆర్‌ఏ నాగప్ప ఉన్నారు.


Updated Date - 2021-07-30T04:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising