ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవులు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు

ABN, First Publish Date - 2021-10-30T04:09:18+05:30

తెలంగాణలో కవులకు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు సముచిత స్థానం సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్నట్లు ఎంపీ పోతుగంటి రాములు అన్నారు.

గూండూరులో పర్యటిస్తున్న ఎంపీ పొతుగంటి రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గుండూరు హన్మశర్మ గొప్ప సాహితీవేత్త 

- దుందుభీ కావ్యం పాఠ్యాంశంలో చేర్చడం అభినందనీయం 

- ఎంపీ పొతుగంటి రాములు 


కల్వకుర్తి, అక్టోబరు 29: తెలంగాణలో కవులకు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు సముచిత స్థానం సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్నట్లు ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. గుండూరు గ్రామ మాజీ సర్పంచ్‌ దివంగత హన్మశర్మ గొప్ప సాహితీ వేత్త, సామాజిక వేత్త అని, ఆయన రచించిన దుందుభీ కావ్యంలోని కొన్ని భాగాలను ఇంటర్‌ ద్వితీయ సంసవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చడం అభినంద నీయమని అన్నారు.కల్వకుర్తి మండల పరిధిలోని గుండూరు గ్రామంలో హన్మశర్మ కుటుంబాన్ని శుక్రవారం ఆయన కలిసి మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో దుందుభీ కావ్యాన్ని పాఠ్యాంశంలో చేర్చడం పట్ల హన్మశర్మకు సముచిత స్థానం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎంపీ వెంట గ్రామ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. 

Updated Date - 2021-10-30T04:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising