ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు

ABN, First Publish Date - 2021-10-29T04:54:27+05:30

జీవితంలో వ్యసనాలకు తావివ్వొద్దని, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు.

పోలీసుస్టేషన్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లక్ష్యం నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి

- సాధారణ విద్యార్థినైన నేను ఎస్పీ స్థాయికి ఎదిగాను

- ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌

ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబరు 28 : జీవితంలో వ్యసనాలకు తావివ్వొద్దని, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన అవగాహనా సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువులో సాధారణ విద్యార్థినైన తాను ఎస్‌ఐ కావాలని ఎనిమిదవ తరగతిలోనే లక్ష్యం నిర్దేశించుకున్నానని, ఎస్పీ స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ప్రభుత్వం మంచి వసతులు కల్పించిందని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక దృఢత్వం అవసరమని చెప్పారు. 


స్నేహ పూర్వకంగా మెలగాలి

పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్సీ రంజన్‌రతన్‌ కుమార్‌ సిబ్బందికి సూచించారు. ఇటిక్యాల మం డల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌, రిసెప్షన్‌ కేంద్రా లను ఆయన గురువారం ప్రారంభించారు. అనం తరం సిబ్బందితో సమావేశమయ్యారు. గ్రామంలోని యువతతో, ప్రజలతో పోలీసు సిబ్బంది స త్సంబంధాలను కొనసాగించాలని చెప్పారు. గ్రామాల్లో జరిగే అక్రమాలను నిరోధించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, సీఐ సూర్యా నాయక్‌, ఎస్‌ఐలు సత్యనారాయణ, వీణారెడ్డి, ప్రిన్సిపాలు తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising