ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధన్వాడ దవాఖానాలో కరోనా కిట్ల కొరత

ABN, First Publish Date - 2021-05-10T05:04:12+05:30

ధన్వాడ ప్రభుత్వ దవాఖా నలో కరోనా కిట్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. మం డలంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతు న్నా ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు మాత్రం సరిగ్గా లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కన్పించని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

- పెరుగుతున్న కరోనా కేసులు

ధన్వాడ, మే 9 : ధన్వాడ ప్రభుత్వ దవాఖా నలో కరోనా కిట్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. మం డలంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతు న్నా ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు మాత్రం సరిగ్గా లేదు. కరోనా కిట్లు లేకపోవడంతో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. ఒక్క ధన్వాడలో ఇప్పటి వరకు వందకు పైగా కరోనా కేసులు నమోద య్యాయి. ఇందులో ఎంత మంది రికవరీ అయ్యారో కూడా సక్రమంగా తెలియడం లేదు. మండలంలోని కిష్టాపూర్‌, మందిపల్లిలోను పరి స్థితి ఇదే విధంగా ఉంది. రెండు రోజుల క్రితం ధన్వాడలో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెం దారు. తాజొద్దీన్‌ అనే యువకుడు కరోనా బారిన చనిపోవడం అంతకుముందే మూడు గంటల ముందే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందిం ది. అయితే, తల్లి అంత్యక్రియల కోసం తవ్విన గుంతలో కొడుకును పూడ్చడం బాధాకర విష యం. ప్రస్తుతం కరోనా పరంగా ఇటు అధికా రుల, అటు ప్రజాప్రతినిధుల బాగస్వామ్యం ఏమా త్రం కన్పిండం లేదు. ధన్వాడ మండలంలో ఇప్ప టి వరకు 200 పైగా కరోనా కేసులు నమోదు అయినట్టు సమాచారం. దవాఖానలో ఏము న్నాయి, మందులు ఉన్నాయా? ఉంటే అందరికి అందుతున్నాయా? కరోనా టీకాలు అందరు వేసుకుంటున్నారా, లేదా? కరోనా కిట్లు ఎన్ని వస్తున్నాయి, ఎంత మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఎంపీపీ పద్మిబాయి, జడ్పీటీసీ విమలాఅంజియాదవ్‌ స్థానిక ప్రజాప్రతినిదులు ఎవరూ ఇప్పటి వరకు దవాఖానాల దరిదాపుల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. కరోనా విషయంలో ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఒ పక్కా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నా స్పందన కానరావడం లేదు. ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-05-10T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising