ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని వినియోగంలోకి తేవాలి: కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2021-06-24T05:29:15+05:30

జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ వద్ద మార్కెటింగ్‌, మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని వెంటనే వినియోగంలోకి తేవాలని మాజీ ఏఎంసీ చైర్మన్‌ బండివేణుగోపాల్‌ అన్నారు.

ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నారాయణపేట క్రైం, జూన్‌ 23: జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ వద్ద మార్కెటింగ్‌, మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని వెంటనే వినియోగంలోకి తేవాలని మాజీ ఏఎంసీ చైర్మన్‌ బండివేణుగోపాల్‌ అన్నారు. మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకొని సముదాయాన్ని వినియోగంలోకి తేవాలని కాంగ్రెస్‌ పార్టీ ఆఽధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ముందుగా డీసీసీ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలపై దీక్షా స్థలికి బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బండివేణుగోపాల్‌ మాట్లాడుతూ రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ప్రారంభించాలన్నారు. టెండర్లు పిలవని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే మార్కెటింగ్‌ శాఖ ఇప్పటివరకు రూ.కోటి ఆధాయాన్ని కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండీ గౌస్‌, శశికాంత్‌ చామకూర, కోట్ల రవీందర్‌రెడ్డి, బోయ రమేష్‌, శరణప్ప, ఖురేషి, యూసుఫ్‌తాజ్‌, మైనొద్దీన్‌, వెంకటయ్య, మనోజ్‌, కల్యాణ్‌, బండి ఆనంద్‌, సీతారాంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising