ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బారికేడ్లను ఏర్పాటు చేసి.. వాహనాలను నియంత్రించాలి

ABN, First Publish Date - 2021-05-16T05:01:32+05:30

జిల్లా కేంద్రంలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించా రు.

విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రోడ్లపైకి అనవసరంగా వచ్చే 

వాహనాలను సీజ్‌ చేయండి

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ పర్యవేక్షణ 

గద్వాలక్రైం, మే 15: జిల్లా కేంద్రంలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించాలని  ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించా రు. లాక్‌డౌన్‌ సందర్భంగా శనివారం  జిల్లాకేంద్రంలోని వైఎస్‌ఆర్‌ చౌక్‌లో పర్యవేక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లాకేంద్రంలో వాహనదారులు ఎక్కు వగా రోడ్లపైకి వస్తున్నారని, అనవసరంగా వచ్చే వాహనాలు సీజ్‌ చేయాలని సూచించారు. కరోనా పరీక్షలకు, వ్యాక్సిన్‌కు, ఆసుపత్రి సమస్యలపై వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సి బ్బందికి సూచించారు. కరోనా ఉదృతి తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాల న్నారు. లాక్‌డౌన్‌కు సహకరించే ప్రజలకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.  ఆయన వెంట  డీఎస్‌పీ యాదగిరి, ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తదితరులున్నారు.

చెక్‌పోస్టులను పరిశీలించిన ఎస్పీ

గద్వాల, మే 15 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సందర్భంగా గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను  ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. జిల్లాలో పుల్లూరు, రాజోళి, నందిన్నె, బల్గెర, జూరాల, అలంపూర్‌ వద్ద ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిన్న, మొన్నటి వరకు పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అంబులెన్స్‌ల వివాదం కొనసాగుతుండటంతో మిగతా చెక్‌పోస్టులపై దృష్టి సారించలేకపోయారు. అంబులెన్స్‌ల వివాదం సమసిపోవటంతో మిగతా చెక్‌పోస్టుల పనితీరు ఎలా ఉందనే విషయంపై ఆయన  నందిన్నె చెక్‌పోస్టును తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు.

Updated Date - 2021-05-16T05:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising