ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ మృతి

ABN, First Publish Date - 2021-06-21T04:41:33+05:30

గత 50 ఏళ్లుగా వనపర్తిలో ఫొటోగ్రాఫర్‌గా సేవ లందించిన బెక్కరి ప్రకాశ్‌(68)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.

ప్రకాశ్‌ చిత్రపటం ముందు నివాళులు అర్పిస్తున్న ఫొటోగ్రాపర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూన్‌ 20 : గత 50 ఏళ్లుగా వనపర్తిలో ఫొటోగ్రాఫర్‌గా సేవ లందించిన బెక్కరి ప్రకాశ్‌(68)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. వనపర్తిలో తొలి ఫొటోస్టూడియో స్థాపించిన ఆర్టిస్ట్‌ నారాయణ కుమారుడు ప్రకాశ్‌ ఐదు దశాబ్దాలుగా ఫొటోగ్రఫి వృత్తిలో కొనసాగారు. అందరితో కలివిడిగా ఉండే ప్రకాశ్‌  ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా సీని యర్‌ ఫొటోగ్రాఫర్‌ మృతి పట్ల వనపర్తి ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్ల సంఘం తీవ్ర సంతాపం తెలియజేశారు. స్టూడియోలన్నీ మూసివేశారు. రాజీవ్‌చౌక్‌లో ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఫొటోగ్రఫి రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో సీనియర్‌ ఫొటోగ్రాఫర్లు కలోరమ ప్రభాకర్‌, సుల్తాన్‌, రఫీ, భవాని రాము, జాని, ముంత శ్రీనివాసులు, నిర్మల, ఆర్‌కె బాబు శ్రీను, సంఘం అధ్యక్షుడు నవీన రమేష్‌, పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T04:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising