ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రంలోనే విక్రయించండి

ABN, First Publish Date - 2021-04-19T04:39:15+05:30

కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి



నారాయణపేటటౌన్‌/ నారాయణపేట రూరల్‌, ఏప్రిల్‌ 18 : కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. దళారుల బారీన పడకుండా రైతులు లబ్ధిపొందాలని సూచించారు. ఆదివారం మండలంలోని సింగారం చౌరస్తాలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో వరికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తీసుకువచ్చిన ఽదాన్యాన్ని ఎలాంటి అవకతవకలు జరగకుండా కొనుగోలు కేంద్రాల్లో కొంటారని తెలిపారు. ప్రతి క్వింటాలుకు ఏ గ్రేడ్‌కు రూ. 1,888, బి గ్రేడ్‌కు రూ.1868కి తగ్గకుండా కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు కొంకల్‌ నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొంకల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ అంజలి, జడ్పీ కోఆప్షన్‌ తాజుద్దీన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కన్న జగదీశ్‌, విండో ఉపాధ్యక్షుడు గట్టు విజయ్‌, నాయకులు వేపూరి రాములు, సుభాన్‌రెడ్డి, విశ్వనాథ్‌, బాలరాజు, భగవంతు నర్సింహ, అడివప్ప పాల్గొన్నారు. 


సీతారాముల కల్యాణానికి ఆహ్వానం


మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గుట్టపై వెలిసిన పురాతన రామాలయంలో ఈనెల 21న నిర్వహించబోయే సీతారాముల కల్యాణానికి రావాల్సిందిగా ఆదివారం గ్రామస్థులు పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ పురాతన దేవాలయానికి రహదారితో పాటు వివిధ సౌకర్యాలు కల్పించారని తెలిపారు. వైభవోపేతంగా నిర్వహించ తలపెట్టిన సీతారాముల కల్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యేను కోరారు. పత్రికను అందించిన వారిలో సుభాన్‌రెడ్డి, ఎంపీపీ ఎ.శ్రీనివాస్‌రెడ్డి, గవినోళ్ల విశ్వనాథ్‌, నరసింహ, అడివప్ప, దేవేంద్రప్ప, రంగారెడ్డి, దస్తప్ప, భరత్‌ ఉన్నారు. 



Updated Date - 2021-04-19T04:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising